-->

Label

    Rahul Sipligunj [Bigg boss 3 Telugu] పునర్నవి కౌగిలింత కోసం నామినేట్ అవుతావా రాహుల్? ఆడేస్తున్న నెటిజన్లు

    Rahul Sipligunj: పునర్నవి కౌగిలింత కోసం నామినేట్ అవుతావా రాహుల్? ఆడేస్తున్న నెటిజన్లు [Bigg Boss Telugu 3] 

    Bigg Boss 3 Telugu Trolls: రాహుల్ నువ్ లేకుండా నేను ఈ హౌస్‌లో ఎలా ఉంటా.. నువ్ నామినేట్ అయి వెళిపోతే నేను ఉండలేను. నీకోసం నేను సీజన్ మొత్తం సెల్ఫ్ నామినేట్ అవడమే మంచిదనిపిస్తుంది.


    Bigg Boss 3 Telugu, Bigg Boss Telugu 3, bigg boss telugu season 3,Bigg Boss 3 Telugu Latest Trolls


    పవన్ కళ్యాణ్, భూమిక జోడీగా నటించిన ‘ఖుషీ’ సినిమా గుర్తుంది కదా.. అందులో నువ్ నా నడుముని చూశావ్ అని భూమిక గొడవపడే సన్నివేశం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. బిగ్ బాస్ హౌస్‌లో పునర్నవీ, రాహుల్ కథ కూడా ఇలాగే ఉంది. ‘మన ఇద్దరి మధ్య ఏదో ఉంది నీకు తెల్సా.. హ హ!!’ అని పునర్నవీ అంటుంటే.. ఉందేమో.. కావచ్చేమో అంటుంటాడు రాహుల్.
    అయితే షో చూసే ప్రేక్షకులతో పాటు నాగార్జున, ఆ మధ్య గెస్ట్ హోస్ట్‌గా వచ్చిన రమ్యక్రిష్ణ సైతం ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే ఇన్ డైరెక్ట్‌గా పంచ్‌లు వేశారు. ‘బాబూ.. రాహుల్!! భూమ్మీద ఉన్నావా? లేక భూపాలంలో ఉన్నావా’ అంటూ రమ్యక్రిష్ణ.. రాహుల్‌పై వేసిన పంచ్ అప్పట్లో పేలిపోయింది.

    అయితే సీజన్ ప్రారంభం నుండి ఈ ఇద్దరూ పక్క పక్కనే ఉంటూ ముచ్చట్లు చెప్పుకోవడం.. ఇద్దరూ కళ్లలోకి కళ్లు పెట్టి చూసుకోవడం.. రొమాంటిక్‌గా మాట్లాడుకోవడం.. లవ్, డేటింగ్ విషయాలపై ముచ్చట్లు పెట్టడంతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులకు కూడా ఏదో కథ నడుస్తుందని ఫిక్స్ అయిపోయారు. అయితే తాజా ఎపిసోడ్స్ గమనిస్తే.. నడవడం కాదు పరుగు పెడుతుందనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు.



    ఇక ఈవారం ఎలిమినేషన్‌ కోసం జరిగిన నామినేషన్స్‌లో పునర్నవి కోసం ఏకంగా తనను తాను నామినేట్ చేసుకున్నాడు రాహుల్. అంతేకాదు.. పునర్నవిని నామినేషన్ నుండి సేవ్ చేయడానికి ఏకంగా 20 గ్లాస్‌ల కాకరకాయ రసాన్ని తాగి అమ్మనా బత్తాయో అనిపించాడు రాహుల్. తనకోసం ఇంత త్యాగం చేసిన రాహుల్‌కి జీవితాంతం గుర్తుపెట్టుకునే రొమాంటిక్ గిఫ్ట్ ఇచ్చింది పునర్నవి. రాహుల్‌ని దగ్గరకు తీసుకుని కౌగిట్లో బంధించి.. డీప్ హగ్‌తో పాటు స్ట్రాంగ్ కిస్ పెట్టేసింది.

    Bigg Boss 3 telugu
    Punarnavi And Rahul Kiss

    మరోవైపు రాహుల్‌ని సేవ్ చేయాలంటే.. పునర్నవి సీజన్ మొత్తం సెల్ఫ్ నామినేట్ కావాలని బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వడంతో తనను తాను నామినేట్ చేసుకునేందుకు సిద్ధపడింది పునర్నవి. అయితే రాహుల్ ఆమెను కన్వెన్స్ చేసిన ప్రాసెస్‌లో ఈ ఇద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఇందులో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకున్నారు.

    రాహుల్ ఏమన్నారు.. ‘నేను నీకోసం కాకరకాయ జ్యూస్ తాగానని నువ్ నాకోసం నామినేట్ కావాల్సిన అవసరం లేదు. సీజన్ మొత్తం నామినేట్ కావడం అంటే చిన్న విషయం కాదు. చాల రిస్క్ వద్దు పున్నూ.. నా ఫైట్ నేను చేసుకుంటా.. నేను ఫైట్ మంచిగా చేస్తే ఉంటా లేదంటే పోతా. అయినా నువ్ ఈవీక్ సేవ్ చేసినా.. నెక్స్ట్ వీక్ ఉంటాననే గ్యారంటీ లేదు. ఇంకా ఆరు వారాలు ఉన్నాయి.. ఒక వారం కాకపోతే ఇంకో వారమైనా నేను పోవచ్చు. నేను నీకోసం ఏం త్యాగం చేయడం లేదు. నాకంటే నీకు మంచి అవకాశం ఉంది. నీ ప్లేస్‌లో ఇంకొకకు ఉన్నా నేను ఇలాగే చెప్తా’ అన్నారు రాహుల్.

    పునర్నవి ఏమంది.. ‘రాహుల్ మరి నువ్ నామినేట్ అయ్యి హౌస్ నుండి వెళిపోతే నా పరిస్థితి ఏంటి? నాకు నిన్ను సేవ్ చేయడమే బెస్ట్ అనుకుంటున్నా. నిన్ను నామినేషన్ నుండి తప్పించకుండా ఉండటం నా వల్ల కావడం లేదు. నాకు నచ్చలేదు. నువ్ నన్ను కన్వెన్స్ చేయొద్దు. నువ్ నా ప్లేస్‌లో ఇంకొకరు ఎవరైనా ఉంటే కూడా ఇలాగే చేస్తా అంటున్నావ్.. నా ప్లేస్ నీకు ఇంకొకరు ఉండరు రాహుల్ నీనే ఉంటా. నువ్ ఎలిమినేట్ అయితే నేను ఉండలేను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పునర్నవి. చివరికి రాహుల్ మాటలకు కన్వెన్స్ అయిన పునర్నవి సెల్ఫ్ నామినేషన్‌కి నో అనడంతో రాహుల్ ఈవారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యాడు.

    అనంతరం టెలిఫోన్ బూత్‌నుండి బయటకు వచ్చిన రాహుల్.. పున్నూ.. ఒక హగ్ ఇవ్వవా ప్లీజ్ అని అడగటంతో పునర్నవీ మళ్లీ రాహుల్‌కి డీప్ హగ్ ఇచ్చింది. చాలాసేపు ఈ ఇద్దరి మధ్య ప్రేమ ముచ్చట్లు జరగ్గా.. బయట ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రీముఖి లోపల అంతసేపు ఏం చేశారు.. సినిమా స్క్రిప్ట్ ఏమైనా ఉందా అని అడగటంతో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉందిలే అని ఓపెన్ అయ్యాడు రాహుల్. అయితే ఒక్క హగ్ కోసం నామినేషన్ చేసుకుంటావా? రాహులా అంటూ వీరిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.




    Disclaimer: Gambar, artikel ataupun video yang ada di web ini terkadang berasal dari berbagai sumber media lain. Hak Cipta sepenuhnya dipegang oleh sumber tersebut. Jika ada masalah terkait hal ini, Anda dapat menghubungi kami disini.
    Related Posts
    Disqus Comments
    © Copyright 2019 Bigg Boss 3 Telugu | Bigg Boss Telugu 3 | Bigg Boss Telugu Season 3 Latest Updates | Bigg Boss 3 - All Rights Reserved - Template Created by Bigg Boss 3 - Proudly powered by Blogger