Bigg Boss 3 Telugu Episode 51 Highlights: అలీ చచ్చిపోలేదు.. శ్రీముఖి ఫైర్
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 50 ఎపిసోడ్‌లను పూర్తి చేసి సోమవారం నాటితో 51వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
కష్టంగా ఉంది.. నాకు చాలా కష్టంగా ఉంది. అలీ లేకుండా నేను తట్టుకోలేకపోతున్నా.. హౌస్‌లో ఉండటం నా వల్ల కాదు. నాకు నిద్ర కూడా పట్టడం లేదు అంటూ నిన్నటి ఎపిసోడ్‌లో కన్నీటి ట్యాప్‌ని విప్పిన శివజ్యోతి నేటి ఎపిసోడ్‌లోనూ కంటిన్యూ చేసింది. ఆమెను ఓదార్చడంలో బిజీ అయ్యింది పునర్నవి.
ఎమోషనల్‌గా నాతో ఆడుకుంటున్నావ్.. నువ్ మంచోడివి అయితే ఏదైనా ట్విస్ట్ ఇవ్వు. అషు, అలీ మళ్లీ వెనక్కి వచ్చేలా చేయి. అయినా సరే.. నేను గేమ్ ఆడతాను అంటూ ధైర్యం తెచ్చుకునే ప్రయత్నం చేయగా.. రవిక్రిష్ణ ఆమెకు అడ్డుపడ్డాడు. నువ్ ఒక్కదానివేనా ఏడ్చేది నేను ఏడొద్దా.. పెర్ఫామెన్స్ ఇవ్వొద్దా అన్నట్టుగా శివజ్యోతితో కలిసి ఏడ్చేందుకు పోటీపడ్డాడు.

ఇంతలో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. ‘ఆపండెహే ఇది సంతాప సభ కాదు.. ఆడు (అలీ) చచ్చిపోలేదు. ఏడుస్తూ కూర్చోడానికి రెండు పీకుతా మిమ్మల్ని ఇద్దర్నీ.. మామూలుగా కొట్టను అని వారించడంతో కాస్త కంట్రోల్ అయ్యారు శివజ్యోతి, రవిలు. ఇక ఎపిసోడ్ ప్రారంభంలో అలీ రజా ఎలిమినేట్ కావడానికి కారణమైన బాబా భాస్కర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఎనిమిదో వారం ఎలిమినేషన్ Bigg Boss 3 Telugu ఇంట్రస్టింగ్..
ఏడో వారంలో అలీ రాజా బ్యాగ్ సర్దేయగా.. మిగిలిన 11 మందిలో ఒకర్ని ఎనిమిదో వారంలో ఇంటికి పంపేందుకు ఎలిమినేషన్ ప్రాసెస్‌ను మొదలుపెట్టారు Bigg Boss . ఈవారం ఎలిమినేషన్‌లో భాగంగా హౌస్‌లో ఉన్న 11 మందిని రెండు గ్రూపులుగా విడగొట్టారు బిగ్ బాస్. అయితే హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న బాబా భాస్కర్‌కి మినహాయింపు ఇచ్చారు. గ్రూప్ 1లో రాహుల్, వరుణ్, వితికా, శిల్ప, పునర్నవిలు ఉండగా.. గ్రూప్ 2లో రవి, శివజ్యోతి, శ్రీముఖి, మహేష్, హిమజలు ఉన్నారు. ఒక్కో గ్రూప్ వాళ్లు.. తమ ఆపోజిట్ గ్రూప్‌లో ఉన్న ఇద్దరి ఫొటోలను తీసుకుని మంటల్లో కాల్చి నామినేట్ చేయడానికి సరైన రీజన్ చెప్పాలని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే..
రవి.. రాహుల్, శిల్ప
పునర్నవి.. మహేష్, శ్రీముఖి
శివజ్యోతి.. పునర్నవి, శిల్ప
శిల్ప చక్రవర్తి.. జ్యోతి, హిమజ
శ్రీముఖి.. పునర్నవి, శిల్ప
వితిక.. రవి, రాహుల్
హిమజ.. శిల్ప, వితిక
వరుణ్.. మహేష్, హిమజ
మహేష్.. పునర్నవి, వరుణ్
రాహుల్.. శ్రీముఖి, రవి
ఈ ఎలిమినేషన్ ప్రాసెస్‌లో ఎక్కువ మంది శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖిలను నామినేట్ చేయడంతో ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు.
బాబా భాస్కర్‌కి ప్రత్యేక అధికారం.. రవి సేఫ్
హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న బాబా భాస్కర్‌కి ప్రత్యేక అధికారం ఇచ్చారు బిగ్ బాస్. నామినేషన్‌లో ఉన్న శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖి ఆరుగురిలో ఒకర్ని సేవ్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో రవిని సేవ్ చేశారు బాబా భాస్కర్.